ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య !

-

తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే గంధమల్ల రవి అనే వ్యక్తి ఐలయ్య ఇంట్లోని 3వ అంతస్తులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ విషయమై వారం రోజుల క్రితం ఐలయ్య ఇంట్లో గొడవ జరిగినట్లు సమాచారం అందుతోంది.

A man committed suicide at the house of Aleru MLA Beerla Ilayya
A man committed suicide at the house of Aleru MLA Beerla Ilayya

దీంతో మనస్తాపం చెందిన గంధమల్ల రవి నిన్న శుక్రవారం రాత్రి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని అంటున్నారు. ఈ విషయాన్ని బైటికి పొక్కకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సంహరణ పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news