డ్రగ్స్ రవాణాకు నైజీరియన్ల కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారం పేరుతో యువతులను ఆకర్షిస్తున్నారు నైజీరియన్లు. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చాయంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇక నైజీరియాకి వచ్చి లాభాలు తీసుకెళ్లాలంటూ పిలుపునిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని నైజీరియాకు పిలుపించారు.
దాదాపు వారం రోజుల పాటు ఆ యువతితో నైజీరియాలోనే మకాం వేయించారు. ఇక
తిరిగి వెళ్లేముందు సూట్‌కేసును అప్పగించి డెలివరీ చేయాలని ఆదేశించారు. ఆ యువతి దాదాపు
10 సార్లు నైజీరియన్‌కు వెళ్లి సూట్‌కేసు తీసుకొచ్చింది. 10 సార్లు తీసుకొచ్చిన తరువాత ఇటీవల కస్టమ్స్ తనిఖీల్లో సూట్‌కేసుతో పట్టుబడింది యువతి. ఆ సూటికేసులో ఏముందని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. సూట్ కేసులో పెద్దమొత్తంలో డ్రగ్స్‌ను గుర్తించారు అధికారులు. ఆ యువతికి తెలియకుండానే నైజీరియన్స్ డ్రగ్స్ సరఫరా చేయించారంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. నైజీరియన్స్ మాయ మాటలు నమ్మకూడదని యువతకు సూచిస్తున్నారు పోలీసులు.