తెలంగాణలో TRS పేరుతో కొత్త రాజకీయ పార్టీ?

-

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ రానుందా? అది కూడా టిఆర్ఎస్ పేరుతో రానుందా? ఒక జాతీయ పార్టీ కనుసన్నల్లోనే అది రూపుదిద్దుకోబోతుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. టిఆర్ఎస్ – బిఆర్ఎస్ గా మారడంతో కొందరు కీలక నేతలు టిఆర్ఎస్ పేరుతో పార్టీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, వైయస్సార్ తెలంగాణ, బీఎస్పీ, సహా పలు పార్టీలు తెలంగాణలో ఉన్నాయి.

ఇవన్నీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గట్టిగా తలపడాలని భావిస్తున్నాయి. ఈ లిస్టులోకి తాజాగా టిఆర్ఎస్ పేరుతో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రైతు సమితి, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రైతు సమాఖ్య, తెలంగాణ రాజ్యసమితి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితి టైటిల్ ఎవరికీ కేటాయించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version