వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవరును కొట్టాడు ఓ ప్రయాణికుడు. అయితే.. డ్రైవర్ మీద దాడితో దాదాపు 45 ప్రైవేట్ బస్సులను నిలిపి నిరసనకు దిగారు. దీంతో వికారాబాద్ ఆర్టీసీ డిపోలో నిలిచిపోయాయి బస్సులు. వికారాబాద్ డిపో డ్రైవర్ రాములు పై దాడి చేశాడు నవాజ్ అనే వ్యక్తి. బస్సు అలస్యంపై ప్రశ్నించాడు నవాజ్. అయితే… భోజనం చేస్తున్నాం ఐదు నిమిషాల్లో బయలుదేరుతామని చెప్పారు డ్రైవర్, కండక్టర్.
దీంతో ఆగ్రహానికి గురై.. డ్రైవర్ రాములు పై దాడి చేశాడు నవాజ్. అనంతరం వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు డ్రైవర్ రాములు. అటు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు… నిందితుడు నవాజ్ పై చర్యలు తీసుకోవాలని బస్సులు నిలిపి ఆందోళనకు దిగారు ప్రైవేటు బస్సులు డ్రైవర్లు. దీంతో ఇవాళ ఉదయం నుంచి పరిగి – వికారాబాద్, తాండూర్, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం కేసు నమోదయిందంటున్నారు ఆర్టీసీ అధికారులు.
https://x.com/TeluguScribe/status/1782276467633922069