దుబ్బాక ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్..రెండున్నర కిలోల కొవ్వు తొలగింపు

-

సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది. ఓ యువకుడి కడుపు లోంచి రెండున్నర కిలోల కొవ్వు తొలగించారు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు. గత రెండు సంవత్సరాలు గా కడుపునొప్పితో ఎన్నో ఆస్పత్రులు తిరిగాడు యువకుడు వెంకటేష్.

అయితే.. చివరికి దుబ్బాక ఆస్పత్రిలో చూయించుకోగా… హెర్నియా తరహాలో కొవ్వు ఉందని గుర్తించారు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు. దీంతో ఆపరేషన్ చేసి కొవ్వు తొలగించి యువకుడి ప్రాణాలు కాపాడారు దుబ్బాక ప్రభుత్వాసుపత్రి వైద్యులు. ఇక ప్రస్తుతం ఆ యువకుడు ప్రాణాలతో క్షేమంగా ఉన్నారని ప్రకటించారు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news