అమెజాన్​కు షాకిచ్చిన ఉద్యోగులు.. 2000 మంది విధుల నుంచి వాకౌట్‌..!

-

కరోనా కాలంలో వర్క్ ఫ్రం హోంకు పరిమితమైన ఐటీ ఉద్యోగులు ఆ తర్వాత కాలంలో కూడా అదే పద్ధతికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం ఆఫీసు విధానాన్ని షురూ చేశాయి. మరికొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే ఈ విధానాన్ని చాలా కంపెనీల ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా అమెజాన్ కూడా ఉద్యోగులను తప్పకుండా ఆఫీసుకు రావాలని ఆదేశించింది. ఆ తర్వాత వచ్చిన ఉద్యోగుల్లో వేల మందిని ఇంటికి పంపించింది.

ఆ సంస్థ తీరుతో విసిగిపోయిన ఉద్యోగులు అమెజాన్​పై తిరుగుబాట బావుటా ఎగురవేశారు. కంపెనీ చర్యలను ఖండిస్తూ ‘వాక్‌ ఆఫ్‌ జాబ్‌’ కుసిద్ధమయ్యారు. దాదాపు 2000 మంది అమెజాన్ ఉద్యోగులు సంస్థ తీరుకు వ్యతిరేకంగా సీటెల్‌లోని ప్రధాన కార్యాలయం స్పియర్స్ భవనం ముందు ‘వాక్ అవుట్‌’లో పాల్గొనేందుకు సమాయత్తంగా ఉన్నారు. దాంతో అమెజాన్‌కు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. తమతోపాటు మిగతా ఉద్యోగులు కూడా ఆందోళనలకు కలిసిరావాలని నిరసనలో ఉన్న ఉద్యోగులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news