అత్యాచారం కేసులో అమెరికా లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్ (31) పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడే ఉద్యోగం చేస్తూ ఒక్లహామా రాష్ట్రంలోని ఎడ్మండ్ నగరంలో భార్యతో కలిసి నివాసముంటున్నాడు. అయితే, 15 ఏళ్ల వయసున్న బాలుడిగా నటిస్తూ ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాగే, తనతో లైంగిక సంబంధానికి అంగీకరించని మరో 19 మంది బాలికల అసభ్య చిత్రాలను సోషల్ మీడియాల్లో పోస్టు చేసి బెదిరించాడు.
జబాధితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఎల్బీఐ అధికారులు 2023 అక్టోబరులో
సాయికుమార్పై కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తులో బాలుడిగా నటిస్తూ బాలికలపై లైంగిక
దాడులు, వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు. నేరం చేసినట్లు రుజువ్వటంతో అమెరికా కోర్టు
అతడికి 2025 మార్చి 27న 35 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో మానసిక వేదనకు
గురైన సాయికుమార్ జులై 26న జైలులోనే ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సాయికుమార్ తండ్రి ఉప్పలయ్య, కుటుంబ సభ్యులు అమెరికాకు వెళ్లి అక్కడే అంత్యక్రియలు పూర్తి
చేసినటు సమాచారం.