250 గజాల లోపు ఇండ్లకు ట్యాక్స్ లు రద్దు..కేసీఆర్‌ సర్కార్‌ కీలక నిర్ణయం !

-

సామాన్య ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. గ్రేటర్ పరిధిలో ఉన్న 200 నుంచి 250 చదరపు గజాలు లోపు ఉన్న.. నాన్ కమర్షియల్ ఇండ్లకు ప్రాపర్టీ టాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చి… అంతకు మించి ఉన్న కమర్షియల్, నాని కమర్షియల్ ప్రాపర్టీ దార్ల టాక్స్ ను పెంచేందుకు జిహెచ్ఎంసి సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది.

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో జిహెచ్ఎంసి యాక్టర్ లో చట్ట సవరణ చేసి.. దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నిర్ణయం అమలు అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ స్కీం అమలుకాని ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే టాక్స్ చెల్లించడం వాళ్లకు దాన్ని..2033-23 ఆర్థిక సంవత్సరానికి వర్తింపజేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

నాలుగు నెలల క్రితమే జిహెచ్ఎంసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. గ్రేటర్ లో 200 నుంచి 250 చదరపు గజాల లోపు ఉన్న ఆస్తులు 30 శాతం మాత్రమే ఉన్నాయి. ఇందులో సగం మంది ప్రాపర్టీ దారులు ఏడాదికి 101 రూపాయలు మాత్రమే పేద మధ్యతరగతి ఇండ్ల యజమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జిహెచ్ఎంసి నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version