వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 5 గురు మృతి

-

వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఉన్నటువంటి ఇల్లందలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇల్లంద జాతీయ రహదారిపై ఓ ఆటోను లారీ ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా… ఆస్పత్రికి తరలించిన తర్వాత మరొకరు మృతి చెందారు. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ఆ గాయాలు అయిన వారి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఆటోలో ప్రయాణిస్తున్న వారు వరంగల్ నుంచి తొర్రూర్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే లారీ డ్రైవర్ ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news