యార్లగడ్డ వెంకట్రావు పార్టీ వీడితే నష్టమేమీ లేదు – సజ్జల

-

గన్నవరానికి చెందిన యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ పార్టీని విడతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో యార్లగడ్డ వెంకట్రావు…. వరుసగా అతను సన్నిహితులతో సమావేశం జరుపుతూ పార్టీ వీడేటంపై కీలక చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే యార్లగడ్డ వెంకట్రావు పార్టీ వీడటంపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.

యార్లగడ్డ వెంకట్రావు ఎటు వెళ్లాలన్నది అతని ఇష్టం అన్నారు సజ్జల. ఒకరికి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చిన చోట మరొకరికి సర్దుబాటు చేస్తాం.. కాదనుకుంటే వారి ఇష్టమంటూ వెల్లడించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి నిర్ణయాలు వారివి అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే.. యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారాన్ని వైసీపీ పార్టీ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, యార్లగడ్డ వెంకట్రావు కు టిడిపి నుంచి ఆఫర్ ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news