ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గురువారం రోజున మెగా పేరెంట్, టీచర్ సమావేశం నిర్వహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ కళాశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సమావేశానికి హాజరవుతారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాలను గురించి ఈ సమావేశంలో చర్చిస్తారు. మొక్కలు నాటడం, ఆటల పోటీలు, భోజనాల ఏర్పాటు కార్యక్రమాలను చేస్తున్నారు.

ప్రతి విద్యార్థికి ప్రోగ్రెస్ కార్డును అందిస్తారు. ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తుంది. ఈ సమావేశంలో అనేక రకమైన ఆసక్తికర విషయాలను గురించి చర్చించనున్నారు. ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు తప్పకుండా ఈ సమావేశానికి హాజరు కావాలని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు.