సీఎం కేసీఆర్ వ్య‌క్తి కాదు శ‌క్తి : న‌టుడు సుమ‌న్

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ పై సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ పొగ‌డ్త వ‌ర్షం కురిపించాడు. ఎంతో మంది సీఎంలు వ‌చ్చినా.. కేసీఆర్ లాంటి వ్య‌క్తి ఎప్పుడూ రాలేద‌ని అన్నాడు. అంతే కాకుండా కేసీఆర్ ఒక వ్య‌క్తి మాత్రమే కాదు.. శ‌క్తి అంటూ కొనియాడారు. కాగ రాష్ట్రంలో యాదాద్రిని అద్భుతంగా తీర్చి దిద్దార‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఏ ముఖ్య మంత్రికి కూడా ఇలాంటి ఆలోచ‌న రాలేద‌ని అన్నారు. అందుకే కేసీఆర్ వ్య‌క్తి కాదు.. ఒక శక్తి అని వ్యాఖ్యానించాడు.

యాదాద్రిని పునఃనిర్మించి దేశంలోనే గొప్ప స్థాయికి తీసుకెళ్లార‌ని అన్నారు. యాదాద్రిని ఇంత అద్భుతంగా తీర్చి తిద్దిన సీఎం కేసీఆర్ కు కృత‌జ్ఞ‌తలు తెలిపాడు. యాదాద్రి త‌ప్ప‌కుండా అభివృద్ధి అవుతుంద‌ని అన్నారు. అలాగే యాదాద్రి దేవాల‌యం చుట్టు కూడా సినిమా షూటింగ్ మంచి ప్రాంతంగా ఉంటుందని అన్నారు. త్వ‌ర‌లోనే ఇక్క‌డ అనేక సినిమాలు షూటింగ్ జ‌రుపుకునే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని అన్నారు. అలాగే సీఎం కేసీఆర్ పాల‌నలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో దూసుకుపోతుంద‌ని అన్నారు.