అదానీ, ప్రధాని మోడీ దేశం పరువు తీశారు : సీఎం రేవంత్ రెడ్డి

-

అదానీ, ప్రధాని మోడీ దేశం పరువు తీశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లేస్ రోడ్డు నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు.  రాజ్ భవన్ ఎదుట రోడ్డు పై భైఠాయించి మీడియాతో మాట్లాడారు. అదానీ అంశం పై ప్రధాని మోడీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ లో దీనిపై నిలదీసినా కేంద్రం స్పందించడం లేదు. కాంగ్రెస్ దేశం పరువు, ప్రతిష్టలను కాపాడుతుంటే.. మోడీ, అదానీ పరువు తీస్తున్నారని పేర్కొన్నారు.

CM Revanth Reddy

దీనిపై అవసరం అయితే రాష్ట్రపతి భవన్ వద్ద కూడా నిరసన తెలుపుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రాజ్ భవన్ కి పిలుపునివ్వడం ఏంటి..? అని కొందరూ ప్రశ్నిస్తున్నారు. మా నిరసన కొందరికీ నచ్చకపోవచ్చు. అదానీ పై జేపీసీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.  అదానీ ని కాపాడేందుుక మోడీ ప్రయత్నిస్తున్నారు. మోడీ వదిలిపెట్టినా అదానీని అమెరికా మాత్రం వదిలిపెట్టడదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version