కరీంనగర్ జిల్లా ధర్మపురి కాంగ్రెస్ ఇంచార్జ్ అడ్లూరి లక్ష్మన్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018 లో ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అన్నారు. చివరి పదకొండు రౌండ్లలో ఐదు ఈవీఎం మిషన్లు పనిచేయలేదని.. అప్పటి కలెక్టర్ పై అనుమానం వ్యక్తం చేస్తూ అబ్జర్వర్ కి ఫిర్యాదు చేసానని అన్నారు. ఈ వ్యవహారమంతా సిసి పుటేజ్ లో రికార్డు అయ్యిందని తెలిపారు. పై స్తాయిలో ఒత్తిడి చేసి ఏకపక్షంగా వ్యవహరించి కొప్పుల ఈశ్వర్ గెలిచారని ప్రకటించారని.. నాకు ఇచ్చిన సర్టిఫైడ్ కాపీకి వారిచ్చిన కాపీలో పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లలో తేడా వచ్చిందని అన్నారు అడ్లూరి లక్ష్మణ్.
దీనిపై అసెంబ్లీ సెక్రెటరీ కి నోటీసు ఇచ్చినా అసెంబ్లీ సెక్రటరీ తిరస్కరించారని తెలిపారు. నేను కోర్టును, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని నమ్ముతున్నానని.. నేను వేసిన పిటిషన్ కొట్టివెయ్యాలని కొప్పుల ఈశ్వర్ నాపై పిటిషన్ దాఖలు చేసారని అన్నారు. రికౌంటింగ్ జరపాలని నేను కోర్టుకి వెలితే.. సుప్రీంకోర్టు కి వెళ్ళిన కొప్పుల ఈశ్వర్ పిటిషన్ ని డిస్మిస్ చేసిందని అన్నారు లక్ష్మణ్. ధర్మపురి అసెంబ్లీ రికౌంటింగ్ కి సిధ్ధంగా ఉన్నానని నిజాయితీ చాటు కోవాలని.. కౌంటింగ్ కి సంబంధించిన సిసి పుటేజ్ కావాలని అడిగినా ఇప్పటికి నాకు సమాధానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక దళితునికి అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇప్పటికి స్పందించలేదన్నారు. ఆర్థిక బలం,అంగబలం తో కొప్పుల ఈశ్వర్ ఎలక్షన్ కమిషన్ ని, కలెక్టర్ లని శాసిస్తున్నాడని ఆరోపించారు లక్ష్మణ్. కొప్పుల ఈశ్వర్ కి చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 24న కోర్టుకి హాజరు అయ్యి రికౌంటింగ్ సిధ్ధంగా ఉన్నానని పిటిషన్ వేయాలని సవాల్ విసిరారు.