తెలంగాణకు మరో గ్లోబల్ కంపెనీ.. రూ.16వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌

-

తెలంగాణపై పెట్టుబడుల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్​లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కేటీఆర్ చొరవతో పలు గ్లోబల్ కంపెనీలు భాగ్యనగరంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. గురువారం రోజున నగరంలో రూ.1200 కోట్ల పెట్టుబడితో కిటెక్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటెగ్రేటెడ్ ఫైబర్ టు అపారెల్ తయారీ క్లస్టర్​కు, రూ.350 కోట్ల వ్యయంతో సింటెక్స్ ఆధ్వర్యంలో పైపులు, వాటర్ ట్యాంకుల తయారీ యూనిట్​కు శంకుస్థాపన చేశారు.

మరోవైపు ఇవాళ ఇంకో గ్లోబల్ కంపెనీ హైదరాబాద్​లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రముఖ గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ సంస్థ ‘అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌’… రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. 16 వేల 650 కోట్లు పెట్టుబడి పెడుతోందని వెల్లడించారు. ఈ మేరకు ‘అడ్వేంట్‌ ఇంటర్నేషనల్‌’ సంస్థ ఎండీ పంకజ్ పట్వారీ, కంపెనీ ప్రతినిధులు… కేటీఆర్‌తో సమావేశమై రాష్ట్రంలో సంస్థ విస్తరణ, పెట్టుబడి కార్యకలాపాలను వివరించారు.

‘అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌’  సంస్థ పెట్టుబడిపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో గ్రీన్‌ ఫీల్ట్‌ ఆర్‌ అండ్‌ డీ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తునందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఫార్మా, లైఫ్‌ సైనెస్ల్‌ రంగాల్లో హైదరాబాద్‌ వృద్ధికి.. ఈ పెట్టుబడి సంకేతమని కేటీఆర్‌ అన్నారు. అండ్వంట్‌ ఇంటర్నేషల్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా  సహకరిస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version