డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరకడంతో..సూసైడ్ అట్టెంప్ట్ చేసిన మందుబాబు

-

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరకడంతో..సూసైడ్ అట్టెంప్ట్ చేశాడు ఓ మందుబాబు. ఈ సంఘటన హైదరాబాద్‌ లోని చంపాపేటలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..చంపాపేట ప్రధాన రహదారిపై సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

మద్యం సేవించి ఆటో నడిపిస్తున్నాడు విజయ్ అనే ఆటో డ్రైవర్. ఇదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. దీంతో కిరోసిన్ పోసుకుని సూసైడ్ అట్టెంప్ చేశాడు విజయ్. పోలీసుల ముందే సూసైడ్ అట్టెంప్ట్ చేశాడు మందుబాబు. వెంటనే పోలీసులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు ఆ మందుబాబు విజయ్‌. ఆటోలో ఉన్న కిరోసిన్ డబ్బా తీసి ఒంటిపై పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. ఇక ఈ సంఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news