సీఎం జగన్ ఓ ఐరన్ లెగ్.. పెద్ద సైకో అని ఫైర్ అయ్యారు నారా చంద్రబాబు నాయుడు. నెల్లూరు లో రూరల్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ వైజాగ్ వెళితే అక్కడ టీడీపీ మెజారిటీ మూడు రెట్లు పెరుగుతుందని.. వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నానని వివరించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన మన పై తప్పుడు కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు..అయితే ప్రజాస్వామ్యంలో ఈతరహా రాజకీయాలకు ప్రజల మద్దతు ఉండదని చెప్పారు. అందుకే అంగళ్లు, పుంగనూరులలో ప్రజా తిరుగుబాబు మొదలైందని పేర్కొన్నారు. జగన్ నిర్ణయాలు సైకో తరహా నిర్ణయాలు అని.. జగన్ వైజాగ్ వస్తాను అంటే విశాఖ ప్రజలు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ లాంటి ఐరన్ లెగ్ వద్దు అని విశాఖ ప్రజలు అనుకుంటున్నారు…జగన్ రుషికొండకు కాదు…ఇడుపుల పాయకు పోతే దరిద్రం పోతుందని చురకలు అంటించారు. జగన్ విశాఖ వెళితే అక్కడి వాతావరణం పొల్యూట్ అవుతుంది…ఉత్తరాంధ్రలో టీడీపీ మెజారిటీ రెండు.. మూడింతలు పెరుగుతుందని చెప్పారు బాబు.