సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముందు ధర్నా..పరిస్థితి ఉద్రిక్తత

-

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముందు ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముందు ధర్నా చేస్తున్నారు డీఎస్సీ-2008 బాధిత అభ్యర్థులు. అయితే…సీఎం రేవంత్‌ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో సీఎం పర్సనల్ సెక్రటరీని కలిసారు 2008 డీఎస్సీ అభ్యర్థులు.

Aggrieved candidates of DSC-2008 protesting in front of CM Revanth Reddy’s residence.

ఫైల్ పై రివ్యూ చేసి రెండు రోజుల్లోగా సీఎం రేవంత్‌ రెడ్డికి పూర్తి నివేదిక అందిస్తామని సీఎం పర్సనల్ సెక్రటరీ హామీ ఇచ్చారు. 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న 2008 అభ్యర్థులకు న్యాయం జరిగేలా సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు అభ్యర్థులు.

Read more RELATED
Recommended to you

Latest news