త్వరలో తెలంగాణకు రానున్న ఎయిర్ అంబులెన్స్‌లు : మంత్రి హరీశ్ రావు

-

తెలంగాణలో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ దేశవ్యాప్తంగా ఆరోగ్య సూచికల్లో తెలంగాణ మూడో స్థానానికి చేరుకుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖలో వచ్చినటువంటి మార్పులపై జరిగిన అభివృద్ధి పై మంత్రి హరీశ్ రావు ప్రగతి నివేదిక విడుదల చేశారు. ఆరోగ్య తెలంగాణ వైద్యానికి శాఖ నివేదికను మంత్రి హరీష్ రావు ఇవాళ విడుదల చేశారు. తలసరి ఆరోగ్య బడ్జెట్ రాష్ట్ర విభజన సమయంలో 925 రూపాయలు ఉండగా అది ఇప్పుడు 35,322 రూపాయలకు చేరుకుందని అన్నారు మంత్రి.

వైద్యాశాఖ ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ప్రతి విషయంలోనూ అభివృద్ధి సాధించిందని..ప్రభుత్వ ఆసుపత్రుల పడకల దగ్గర నుంచి మెడిసిన్, ఆసుపత్రుల వసతులు,వైద్యంతో పాటు వైద్య విద్య, మెడికల్ కాలేజీల సీట్లు ఇలా ఒక్కటి కాదు వైద్యరంగంలో అన్ని రకాల అ  అభివృద్ధి సాధించి తెలంగాణ దేశానికే మోడల్ గా నిలిచిందని మంత్రి వైద్య ఆరోగ్య శాఖ నివేదికలో తెలియజేశారు.  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో 22వేల మందికి ఉద్యోగ కల్పన చేశామని మరొక 7000 వరకు ఉద్యోగ కల్పనకు అవకాశం ఉందని మంత్రి హరీష్ రావు తన నివేదికలో తెలియజేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో కేవలం ఐదు ఐసీయూలు ఉంటే ఇప్పుడు వాటిని ఏకంగా 80కి పెంచుకున్నామని పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news