సీఎం రేవంత్ రెడ్డితో ఆకునూరి మురళి చర్చలు..కారణం ఇదే

-

సీఎం రేవంత్ రెడ్డితో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సమావేశం అయ్యారు. ఇక భేటీ అయిన తరువాత మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడారు. 10 మంది ప్రొఫెసర్ లం కలిసి ఎడ్యుకేషన్ కీ సంబంధించి 33 అంశాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికీ తీసుకెళ్ళామని… అన్ని రాష్ట్రాల్లో 15 , 28 శాతం వరకు విద్యకు బడ్జెట్ కేటాయిస్తున్నారని వెల్లడించారు. మన రాష్ట్రంలో 5 శాతం మాత్రమే విద్యకు బడ్జెట్ కేటాయిస్తారు…. ఇక నుండి విద్యకు బడ్జెట్ లో 15 శాతం కేటాయించాలని సిఎం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.

akunuri murali meets cm revanth reddy

సీఎం రేవంత్ సానుకూలంగా స్పదించారు. కచ్చితంగా 15 శాతం బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు….మండలానికి ఒక ఇంటర్ నేషనల్ స్కూల్ ఎర్పాటు చెయ్యబోతున్నామని సీఎం చెప్పారు చాల సంతోషం అని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం పాలసి చాల మంచి అంశం కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారని… అంగన్వాడీ సెంటర్ లో కరెక్ట్ ఎడ్యుకేషన్ లేదని గుర్తించాం,

మంచి టీచర్ లను నియమిస్తామని సీఎం చెప్పారన్నారు. 74 శాతం నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వెంటనే నియమిస్తాం అని చెప్పారన్నారు.10 రోజులకొకసారి ఎడ్యుకేషన్ పై రివ్యూ చెయ్యాలని చెప్పాం, కచ్చితంగా రివ్యూ చేస్తామని చెప్పారు…త్వరలో ఎడ్యుకేషన్ పై ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేసి ఇవ్వమని చెప్పారు త్వరలోనే డాక్యుమెంట్ తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news