BRS MLAs and MLCs to Raj Bhavan today: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే.. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ ను కలవనున్నారు.
నిరుద్యోగులపై కేసులు, పార్టీ ఫిరాయింపులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఉల్లంఘన వంటి విషయాలపై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపైనా చర్చిస్తారని సమాచారం. కాగా, పార్టీ ఫిరాయింపులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఉల్లంఘన వంటి విషయాలపై ఇప్పటికే తెలంగాణ స్పీకర్ ముధుసూదనా చారికి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.