రోడ్డుపై వలలతో చేపల వేటకు దిగారు జనాలు.. దొరికిన వారికి దొరికినన్ని అన్నట్లుగా ముందుకు వెళుతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి గుడి మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. రోడ్డుపై వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో వలలు, చీరలతో రోడ్లపైనే చేపలను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు.
కాగా, ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయనగరం, కాకినాడ, అల్లూరి, శ్రీకాకుళం, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని స్కూల్స్, కాలేజీలకు ఆయా జిల్లాల కలెక్టర్లు (ఈ రోజు)శనివారం సెలవు ప్రకటించారు.