నారాయణపేట జిల్లా ఊటుకూరు మండల పరిధిలోని చిన్నపొర్ల గ్రామంలో యువకుడి కొట్టి చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయా అని అనుమానాలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి. ఈ ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా ఊటుకూరు ఘటనపై మాజీ ఐఏఎస్ స్పందించారు. ఇంత దారుణమైన, క్రూరమైన హత్యాకాండ జరుగుతున్న సమాజంలో బతుకుతున్నామా అని భయంతో పాటు జుగుప్స పుడుతోంది. సీఎం గారు ఈ ఘటనపై వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి మూడు నెలల్లో జడ్జిమెంట్ వచ్చేలా చేసి నిందితులను ఉరి తీయండి.
అప్పుడే ప్రజలకు ప్రభుత్వం మీద ధైర్యం, నమ్మకం కలుగుతుంది. సరైన సమయానికి స్పందించని పోలీసు సిబ్బందిని కూడా అరెస్ట్ చేసి తక్షణమే సర్వీస్ నుంచి తొలగించాలి. డయల్-100 సేవలను రివ్యూ చేయాలి. అందుకు ఉన్న రెస్పాండ్ టైంను బాగా తగ్గించే చర్యలు చేపట్టాలి. పోలీస్ శాఖలో చాలా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన విలువలతో కూడిన విద్య లేకపోవడం కూడా ఇందుకు కారణం అంటూ ఆయన ట్వీట్ చేశారు.