తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన అలయ్ బలయ్ : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణలో ప్రతీ ఏడాది బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్న తెలిసిందే. ఈ ఏడాది ఆయన  నిర్వహించిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. ముఖ్యంగా అలయ్ బలయ్ లేకుంటే తెలంగాణ ఉద్యమమే పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అలయ్ బలయ్ స్పూర్తి నింపిందని.. ఒకప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీల పరంగానే కార్యక్రమాలుండేవని.. కానీ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా అన్నీ పార్టీలను ఒకే గొడుగు పైకి తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం అలయ్ బలయ్ అన్నారు.

ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ యూ కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకు అందరూ ఒక్కటై తెలంగాణ కోసం గళం విప్పారు. అలయ్ బలయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నుంచి ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి వారసత్వంగా తీసుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సంప్రదాయం. తప్ప, రాజకీయాలతో సంబంధం లేదని కొనియాడారు. దీన్ని నిలబెట్టుకోవాలన్సిన అవసరం ఉందన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా అందరం ఈ కార్యక్రమంలో ప్రతి ఏటా పాల్గొని
విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version