రేవంత్ రెడ్డిని సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో ఆయన నివాసం ఉంటున్నారు. దీంతో జూబ్లీహిల్స్ ఏసీబీ హరిప్రసాద్ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కార్యకర్తలు, అభిమానులను అదుపు చేసేందుకు రెండు ప్లటున్ల సాయుధ బలగాలు విధులు నిర్వహిస్తున్నారు. రేవంత్ రూట్ మ్యాప్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
కాగా, తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉదయం 10. 28 గంటలకు ఆయన ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి AICC అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలుస్తోంది. రేవంత్ తో పాటు 9 లేదా 18 మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను సిఎస్ శాంతి కుమారి పర్యవేక్షిస్తున్నారు.