Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

-

Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల రిహార్సల్ సందర్భంగా గన్ పార్క్ అలాగే పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో వాహనాల రాకపోగలపై శుక్రవారం ఆంక్షలు ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు.

Alert for motorists Traffic restrictions in Hyderabad today

 

గన్ పార్క్ పరిసరాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు.. ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇక పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ట్యాంక్ బండ్ పైన 9 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న ఉదయం, సాయంత్రం ఉత్సవాలు జరగనున్నాయి. అమరులకు నివాళులతో ఉదయం పూట ప్రారంభం కానున్న ఈ వేడుకలు రాత్రి 9 గంటల తర్వాత ముగియనున్నాయి. జూన్ 2వ తేదీన ఉదయం నుంచి రాత్రి వరకు ఈ వేడుకలు అట్టహాసంగా జరిపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news