హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. బీపీ షుగర్ థైరాయిడ్ తదితర దీపిక కాలిక వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కిట్స్ ను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని బస్తీ దావకానాలలో ఉచితంగా అందజేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు.
వృద్ధులు మరియు ఆరోగ్య కేంద్రాలకు రాలేని వికలాంగులు ఇతర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రతినెల వారి ఇంటి వద్దకే వెళ్లి ఎన్సిడి కిడ్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాదులోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఏరియా ఆస్పత్రులతో పాటు నగరంలో ఉన్న 1084 బస్తీ దావఖానాలలో సైతం ఈ కిడ్స్ ప్రతినెల అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కూడా కోరారు.