తెలంగాణకు మరో షాక్ తగిలింది. హైదరాబాద్ నుంచి మరో కంపెనీ తరలిపోయేందుకు రెడీ అయినట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ నుంచి అమర రాజా కంపెనీ తరలిపోనుందట. మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తెలంగాణ నుండి వెళ్ళిపోతామని ప్రకటించారట అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ చైర్మన్ జయదేవ్ గల్లా.
తెలంగాణలో బీఆర్‌ఎస్ హయాంలో అమర రాజా కంపెనీకి చేసిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోతే, మేము మా ప్లాంట్ కోసం వేరే చోట వెతకవలసి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారట అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ చైర్మన్ జయదేవ్ గల్లా.
దీంతో హైదరాబాద్ నుంచి అమర రాజా కంపెనీ తరలిపోతుందని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశంపై కేటీఆర్ స్పందించారు. రాజకీయ విభేదాల వల్ల బ్రాండ్ తెలంగాణ బాధపడకూడదని… తెలంగాణలో 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజును ఒప్పించేందుకు చాలా కష్టపడ్డామన్నారు. అమరరాజా ఇప్పుడు వెళ్లిపోతే తెలంగాణకు తీవ్ర నష్టం అన్నారు.