నేడు రాష్ట్రానికి రానున్న అమిత్ షా

-

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఓవైపు ఎన్నికల అధికారులు పోలింగ్​కు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమవ్వగా.. మరోవైపు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత ప్రచారంలో జోరు పెంచిన బీజేపీ.. జాతీయ నేతలను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ మూడు సార్లు రాష్ట్రంలో పర్యటించగా తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు.

అమిత్ షా ఇవాళ తెలంగాణకు రానున్నారు. బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మధ్యాహ్నాం 12 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా 12 గంటల 5 నిమిషాలకు హెలికాప్టర్‌లో గద్వాల్ ప్రయాణం అవుతారు. అక్కడ బీజేపీ నిర్వహించే సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. అనంతరం నల్గొండకు వెళ్లనున్నారు. నల్గొండలో నిర్వహించే సభలో పాల్గొంటారు.

ఆ తర్వాత వరంగల్‌లోనూ ప్రచారం నిర్వహిస్తారు. వరంగల్ సభ ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకొని… భాజపా మేనిఫెస్టోను అమిత్‌ షా విడుదల చేస్తారు. ఎన్నికల ప్రణాళిక విడుదల అనంతరం సికింద్రాబాద్‌ క్లాసిక్‌ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్ నేతలతో సమావేశంకానున్నారు. సమావేశం అనంతరం రాత్రి 8 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌కు తిరుగు ప్రయాణంకానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version