నేడు రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

-

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ రానున్నారు. జాతీయ పోలీసు అకాడమిలో శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారుల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో అమిత్‌ షా పాల్గొననున్నారు. ఇవాళ రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి జాతీయ పోలీస్ అకాడమీకి వెళ్లి.. రాత్రి అక్కడే బస చేస్తారు.

శుక్రవారం జరిగే పాసింగ్ ఔట్ పరేడ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో ఆయన సూర్యాపేటకు వెళ్తారు. అక్కడ బీజేపీ నిర్వహించే సభలో పాల్గొంటారు. సభ ముగించుకుని సూర్యాపేట నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంటున్న తరుణంలో బీజేపీ.. జాతీయ నాయకులను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే మోదీ, అమిత్ షా రాష్ట్రంలో పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు అమిత్ షా మరోసారి రాష్ట్రానికి వస్తుండటంతో పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. మరోవైపు మోదీ కూడా మరికొద్ది రోజుల్లో మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version