ఈసారి ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు రావాలి…అందులో హైదరాబాద్ ఉండాలని స్పష్టం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. నిన్న హైదరాబాద్ రోడ్ లో పాల్గొన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ…. 40 ఏళ్ల నుంచి హైదరాబాద్ లోక్ సభ కు రజాకార్ ప్రతినిధి గా ఉన్నారన్నారు.

ఈ సారి మాధవీలత ను గెలిపించి రజాకార్ నుంచి విముక్తి కల్పించాలని కోరారు. హైదరాబాద్ లో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అందరూ కమలం గుర్తుకు ఓటేసి హైదరాబద్ లో మెయిన్ స్ట్రీమ్ అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు. మాధవీలత ను గెలిపించి మోడీ నాయకత్వాన్ని బలపరచాలన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.