జూన్ నెల రాగానే సామాన్య ప్రజలకు ఊహించని షాక్ తగిలింది. పాల ధరలు రెండు రూపాయలు పెరిగాయి. అయితే అన్ని పాల పైన కాకుండా కేవలం అమూల్ పాల ధరలు పెరగడం జరిగింది. ఇవాల్టి నుంచి పాల ధరలు పెంచుతూ అమూల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. గేదె పాలు 500m ప్యాకెట్ పై రెండు రూపాయలు పెంచారు.
లీటర్ పాల ప్యాకెట్ పై మూడు రూపాయలు ధర పెరిగింది. గోల్డ్ అలాగే తాజా రకం పాలపై లీటరుకు రెండు రూపాయలు పెరిగింది. 1/2 లీటర్ కు ఒక రూపాయి పెంచారు. ఆవు పాలు ఆఫ్ లీటర్ అలాగే లీటర్ ప్యాకెట్ పై రూపాయి పెంచారు. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపనీ స్పష్టం చేసింది. దీంతో సామాన్యులు షాక్ కు గురవుతున్నారు.