హైదరాబాద్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహిళలను వ్యభిచారంలోకి లాగుతున్నారు. హైదరాబాద్ లో ఉపాధి ఆశలు చూపిస్తూ కొంతమంది అమాయకమైన మహిళలను వ్యభిచారంలోకి నెట్టుతున్నారు. హైదరాబాదులో బ్యూటీ పార్లర్లు, స్పా సెంటర్లలో ఉద్యోగాల ఆశ చూపుతూ బంగ్లా యువతులను త్రిపుర, అస్సాం, బెంగాల్ మీదుగా అక్రమ ప్రవేశం చేయిస్తున్నారు. డబ్బుల ఆశతో మహిళలు ఉద్యోగాన్ని నమ్మి వచ్చి చూస్తే తీరా వ్యభిచారం అని తెలిసేసరికి షాక్ అవుతున్నారు.

ఉద్యోగం కోసం వచ్చిన మహిళలు తిరిగి ఇంటికి వెళ్లలేక వ్యభిచార కూపంలో ఇరుక్కుపోతున్నారు. ఇటీవల పోలీసులకు సమాచారం అంది అక్కడికి వెళ్లి చూడగా ఉద్యోగాల పేరుతో మహిళలను మోసం చేస్తున్నారని తెలిసింది. దీంతో పోలీసులు అక్కడ దాడులు నిర్వహించారు. మోసం చేసిన వ్యక్తులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. తప్పకుండా వారిని పట్టుకొని శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. మహిళలను వారి ఇంటికి చేరుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.