ఈనెల 10వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ?

-

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు కౌంట్ డౌన్ షురూ అయింది. ఏ క్షణమైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తోంది. ఇక ఇప్పటికే భారత రాష్ట్ర సమితి తన టికెట్లను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం అందుతోంది.

Revanth reddy

అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మురళీధర నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే ఒకసారి భేటీ కాగా.. ఈనెల 8వ తేదీన మరోసారి సమావేశం కానుంది. 60 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తుండగా… మిగతా స్థానాలపై దృష్టి సారించింది. ఇక ఈనెల 10వ తేదీన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాకు ఆమోద ముద్ర వేయనుంది. అదే రోజున అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news