నిజామాబాద్ రైతులకు మరోసారి కేంద్ర ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పసుపు బోర్డు ప్రకటించినట్లే చేసి… అందులో కూడా మెలిక పెట్టింది. గత మూడు రోజుల కిందట తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి వరాల వర్షం కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ.
ఇక ఇందులో భాగంగానే నిజామాబాద్ పసుపు రైతుల చిరకాల కోరిక అయినా పసుపు బోర్డును కూడా ప్రకటించేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ మేరకు కేబినెట్ కూడా అధికారిక ప్రకటన చేసింది. అయితే తాజాగా గెజిట్ నోటిఫికేషన్ లో మాత్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది కేంద్రం.
పసుపు బోర్డు ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం… నోటిఫికేషన్ లో మాత్రం పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అంటే గెజిట్ నోటిఫికేషన్ లో తెలంగాణ పేరు అసలు లేనేలేదు. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో భూతద్దంతో వెతికినా కూడా తెలంగాణ రాష్ట్రం పేరు కనిపించలేదు. దీంతో నిజామాబాద్ రైతులకు మరోసారి నిరాశే ఎదురయింది.