తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..డిగ్రీ ప్రవేశాలకు మరో ఛాన్స్ కల్పించారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి అధికారులు మరో అవకాశం ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ లో ఖాళీల భర్తీకి షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 21 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 21 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు గడువు ఇచ్చారు. సీట్ల కేటాయింపు 29న చేయనున్నారు. ఎంపికైన కాలేజీల్లో రిపోర్టింగ్ కు 29, 30న అవకాశం కల్పించారు. ఇప్పటికే ఎంచుకున్న కోర్సును మార్చుకునేందుకు ఛాన్స్ ఇచ్చారు.
కాగా, తెలంగాణలో 6603 నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్షుల పోస్టులను మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో క్రమబద్ధీకరించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఈ పోస్టుల్లో నియమించేందుకు ఆదేశించింది. ఇవిగాక మరో 3065 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ముందు ముందు క్రమబద్దికరించే కార్యదర్శులను వాటిల్లో నియమించేందుకు వెసులుబాటు కల్పించింది. జెపిఎస్ లకు నెలకు రూ. 28,719 వేతనం వస్తుండగా… నాలుగో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులను వేతన స్కేల్ ను రూ.24280-72850 వర్తింపజేయనుంది.