హైదరాబాద్‌లో మరోసారి మందు పార్టీ కలకలం రేపింది. ఇప్పుడు ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఇటీవలే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఇంట్లో… కోడి పందాల పోటీలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంఘటన మరువక ముందే.. హైదరాబాద్‌లో మరోసారి మందు పార్టీ కలకలం రేపింది.

జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని ఆలివ్ బిస్ట్రో పబ్ లో డ్రగ్స్ పార్టీ ఉదంతం వెలుగులోకి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. నిన్న రాత్రి పక్కా సమాచారం రావడంతో పోలీసులు సోదాలు చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ తరుణం లోనే…జూబ్లీ హిల్స్ రోడ్ నెం.45లోని ఆలివ్ బిస్ట్రో పబ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో 20 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా తేలిందని పోలీసులు ప్రకటించారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.