బీజేపీలోకి మాజీ ఎంపీ కేశినేని నాని వెళతాడని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో మాజీ ఎంపీ కేశినేని నాని మంతనాలు పూర్తి అయ్యాయని చెబుతున్నారు. అనుచరులతో ఆంతరంగిక భేటీలు జరుపుతున్నారట మాజీ ఎంపీ కేశినేని నాని. త్వరలోనే బీజేపీ పార్టీలో చేరికపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందట మాజీ ఎంపీ కేశినేని నాని.

ఇది ఇలా ఉండగా… తాజాగా రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేశినేని నాని. రాజకీయాల నుంచి తప్పుకున్నా ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉంటానని ప్రకటించారు మాజీ విజయవాడ ఎంపీ కేశినేని నాని. నాకు విజయవాడ అంటే మమకారం.. పిచ్చి.. అంటూ వ్యాఖ్యానించాడు.పదేళ్ల పాటు ఎంపీగా ఉన్నా.. ఎప్పుడూ స్వార్థం చూసుకోలేదని తెలిపారు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు మాజీ విజయవాడ ఎంపీ కేశినేని నాని. కాగా… మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో… విజయవాడ ఎంపీగా… వైసీపీ పార్టీ నుంచి పోటీ చేశారు కేశినేని నాని.