టిడ్కో లబ్దిదారులకు శుభవార్త.. పంపిణీకి ముహూర్తం ఖరారు

-

2014 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన చంద్రబాబు.. టిడ్కో ఇళ్లను ఎంతో ప్రతిష్మాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రెండు గదులతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఐదేళ్లలో చాలా ఇళ్లు నిర్మించారు. కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి అయితే 2019లో చంద్రబాబు అధికారం కోల్పోయారు. అయితే ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు రంగులు మార్చింది. ఒక్క రూపాయికే లబ్దిదారులకు అందజేస్తామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చారు. అయితే ఐదేళ్ల పుణ్యకాలం గడిచిపోయింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు కసరత్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం కొటిపిలో నిర్మాణంలో నిలిచిపోయిన టిడ్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడ్కో ఇళ్లలోని సామాగ్రి నాశనం చేశారని, ఆరు నెలల్లో వాటిని పూర్తి చేసి పేదలకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. 2014 టీడీపీ హయాంలో లేటెస్ట్ టెక్నాలజీతో టిడ్కో ఇళ్లను నిర్మించామని, జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిర్మాణాలు ఆగిపోయాయని తెలిపారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్నదే టీడీపీ లక్ష్యమని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news