హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన థియేటర్

-

హైదరాబాద్‌ లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో థియేటర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..హైదరాబాద్‌ లోని చందానగర్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గంగారం జేపీ సినిమాస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

థియేటర్ లోని ఐదు స్క్రీన్ లలో పర్నిచర్, స్క్రీన్లు కాలిపోతున్నాయి. ఇక సమాచారం అందుకున్నఫైర్ సిబ్బంది…. మూడు ఫైర్ ఇంజన్ల లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఇప్పటికే…లక్షల్లో ఆస్తి నష్టం వచ్చిందని సమాచారం అందుతోంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news