తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేని పెళ్లి చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ తప్పు నుంచి బయటపడేందుకు 58 ఏళ్లు పట్టిందని వ్యాఖ్యానించారు. దేశంలో ఎమర్జెన్సీ పెట్టిందే నియంత ఇందిరా గాంధీ. రాష్ట్రంలో వందల మందిని సోనియాగాంధీ బలి తీసుకుంది. ఢిల్లీ దొరలతో పోరాటం కొత్తకాదు.. వారి పెత్తనాన్ని తిప్పికొడతాం. 11సార్లు అవకాశం ఇస్తే.. ఆ పార్టీకి నీళ్లు, కరెంట్ ఇవ్వడం చేతకాలేదు. రాహుల్ గాంధీ లీడర్ కాదు.. రీడర్ అని విమర్శించారు మంత్రి కేటీఆర్.
కామారెడ్డి రైతుల కల నెరవేర్చడానికే సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్. నవంబర్ 09న కేసీఆర నామినేషన్ వేస్తారని.. నామినేషన్ రోజు వచ్చే ప్రజలను చూసి ఇతర పార్టీల వాళ్లు పోటీ చేసేందుకే భయపడాలన్నారు. బీజేపీ ఇచ్చే చాక్లెట్లకు ఆశపడవద్దు. బీఆర్ఎస్ ఇచ్చే బిర్యాని తినండి. ఇతర పార్టీలు డబ్బులు ఇస్తే.. తప్పకుండా తీసుకోండి. ఓటు మాత్రం బీఆర్ఎస్ కి వేయండి అని సూచించారు మంత్రి కేటీఆర్.