ఉత్తర బంగాళాఖాతంలో ఊపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని IMD వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని చెప్పారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA ట్వీట్ చేసింది.

కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రెండు రోజులపాటు మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండి స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.