హైదరాబాద్ ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో యాపిల్ ఎయిర్ పాడ్స్ తయారీ

-

తెలంగాణ రాష్ట్రానికి విపరీతంగా పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో… హైదరాబాద్ మహానగరంలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు పోటీ పడుతున్నాయి. దానికి తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలను సదరు కంపెనీలకు కల్పిస్తున్నాయి.

ఇలాంటి తరుణంలోనే హైదరాబాదులో ఇటీవల ఫాక్స్ కాన్ ప్లాంట్ పడిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా… హైదరాబాద్ ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో యాపిల్ ఎయిర్ పాడ్స్ తయారీ కానుంది. హైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లో ఫాక్సాకాన్ కంపెనీ ప్లాంట్లో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఐఫోన్ ఎయిర్ పాడ్స్ తయారీ చేయనుంది. డిసెంబరు 2024 నుంచి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version