ఈ ప్రభుత్వంలో కడుపుకు ఇంత తిండి పెట్టే వాళ్లే లేరా..? – హరీష్ రావు

-

నేడు ఖమ్మం జిల్లాలో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటించారు బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర మాజీ ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా వరద ప్రాంతాలలో బాధితులు తమ బాధలు చెప్పుకుంటుంటే తీవ్ర భగవద్వేగానికి గురయ్యారు హరీష్ రావు.

మొదట ఖమ్మం గ్రామీణ మండలంలోని మున్నేరు ముంపు ప్రాంతాన్ని సందర్శించిన బీఆర్ఎస్ నేతలు.. అనంతరం కరుణగిరి రాజీవ్ గృహకల్ప, వెంకటేశ్వర నగర్, కాలువొడ్డు, బొక్కల గడ్డ ప్రాంతాలలో బురదలో కాలినడకన పర్యటిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో కడుపుకు ఇంత తిండి పెట్టే వాళ్లే లేరా..? అని ప్రశ్నించారు. సహాయం చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కేవలం ప్రచారం కోసం వచ్చి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వరద బాధితులు వరదల్లో సర్వం కోల్పోయామని, కట్టుబట్టలతో రోడ్డుమీద నిలుచున్నామని, తినడానికి తిండి, త్రాగడానికి నీరు కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, బురదలో ఉండడానికి నీడ లేక చిన్న పిల్లలతో నరకయాతన అనుభవిస్తున్నామని బాధితులు అడుగుతుంటే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని.. రైతుల పక్షాన అసెంబ్లీలో కొట్లాడుతామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version