హైడ్రా మాదిరిగానే జిల్లాల్లోనూ వ్యవస్థలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

హైడ్రా మాదిరిగానే జిల్లాల్లోనూ వ్యవస్థలు తీసుకొస్తామని  సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు  చేశారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల కబ్జా పై ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గదు. ఖమ్మంలో మాజీ మంత్రి అక్రమ కట్టడాలు కట్టారని తెలిపారు. ఖమ్మంలో ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆసుపత్రి నిర్మించారు. పువ్వాడ ఆక్రమణలపై మాజీ మంత్రి హరీశ్ రావు కూలగొట్టాలని డిమాండ్ చేయాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. 

మరోవైపు  అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారులపై చర్యలుంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. చెరువుల కబ్జా పై ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గదు అని తెలిపారు.  కొంత మంది నాయకులు నాపై విమర్శలు చేస్తున్నారు. ప్రజల కోసం ఏ పనినైనా చేస్తాను. పదేళ్లలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ పరామర్శించారా..? మాసాయిపేటలో పసిపిల్లలు రైలు కింద పడి చనిపోయినప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ అక్కడికి వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించారా..?  ఔటర్ రింగ్ రోడ్డు వద్ద యువతిని రేప్ చేస్తే.. ఆ కుటుంబాన్ని కూడా  పరామర్శించలేదు. ప్రస్తుతం కూడా పక్కా రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు ప్రజలను పరామర్శిస్తున్నారు. కానీ మన రాష్ట్రనేత అసలు ఎక్కడికి వెళ్లాడు..? అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version