కరీంనగర్ జిల్లా లో బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగులనుంది. మానకొండుర్ మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్… కారు దిగేందుకు సిద్ధం అయినట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే… నేడు తన ముఖ్య అనుచరులతో సమావేశం రాజకీయ భవిష్యత్తు పై సమాలోచనలు చేయనున్నారు మానకొండుర్ మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్.
కారు దిగే యోచనలో ఉన్న మానకొండుర్ మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్.. కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు బిఅర్ఎస్ పార్టీలో చేరారు మానకొండుర్ మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్. బిఅరెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు మానకొండుర్ మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్. ఇప్పటికే మోహన్ తో సంప్రదింపులు జరుపుతున్నారు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు మానకొండుర్ మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్…సిద్ధం అయినట్లు సమాచారం.