డీఎడ్‌ అభ్యర్థులకే ఎస్జీటీ పోస్టులు.. సర్కార్ కీలక నిర్ణయం

-

తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డీఎడ్‌ అభ్యర్థులతోనే.. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై జీవో విడుదల చేస్తామని విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులకు మాత్ర మే పోటీపడాల్సి ఉంటుంది.

ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి కూడా అర్హత కల్పిస్తూ 2018లో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్సీటీఈ) నిర్ణయం తీసుకొxది. అయితే ఇటీవలే రాజస్థాన్‌ రాష్ట్రం టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టులో తీర్పునిస్తూ.. ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్‌ పోస్టులను డీఎడ్‌ అర్హత ఉన్న వారితోనే భర్తీ చేయాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పు దేశమంతా అమలు కానున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు.. రాష్ట్రంలో 6,612 టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటిలో 2,575 సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) పోస్టులే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version