వరంగల్ కు కొత్త రైల్వే కారిడార్..!

-

తూర్పు తీర ప్రాంతంలో సమాంతరంగా మరో కొత్త రైలు కారిడార్ రాబోతుంది. ప్రస్తుతం ఉన్న విజయవాడ-విశాఖ-భువనేశ్వర్-కోలకతా రైల్వే కారిడార్ కు ప్రత్యామ్నాయంగా కొత్త రైలు కారిడార్ ఉంటుంది అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బెంగాల్ లోని అసన్‌సోల్ నుంచి వరంగల్ వరకు ఈ సరికొత్త కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. జునాగఢ్ – నవరంగ్‌పూర్, మల్కన్‌గిరి – పాండురంగాపురం వయా భద్రాచలం రైల్వై లైన్లు ఈ కారిడార్లో భాగంగా ఉంటాయి.

ఈ కొత్త రైల్వే కారిడార్ ఏపిలో 85.5 కి.మీ, తెలంగాణ లో 19.77 కి.మీ పొడవు ఉంటుంది. గోదావరి నది పై వంతెన నిర్మాణం తో సహా మొత్తం 174 కి.మీ రైల్వే కారిడార్ ఏర్పాటు జరుగుతుంది. ఈ కొత్త రైల్వే కారిడార్ ద్వారా పశ్చిమ, దక్షిణ ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ ల నుంచి దక్షిణ భారతదేశానికి, మరింతగా కనెక్టివిటీని పెంచుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లోని పలు బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు ఈ కారిడార్ ద్వారా బొగ్గు సరఫరా చేయవచ్చు అని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news