5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్.. అధికార పీఠం ఎవరిదంటే..?

-

ఐదు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఇందులో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి, రెండు రాష్ట్రాల్లో బీజేపీకి అవకాశం దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మిజోరాంలో మాత్రం ‘జొరాం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌’ (జడ్‌పీఎం), ‘మిజో నేషనల్‌ ఫ్రంట్‌’ (ఎంఎన్‌ఎఫ్‌) మధ్య నువ్వా-నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయని.. వాటి తర్వాతి స్థానాల్లోనే హస్తం, కమలదళం ఉన్నాయని పేర్కొన్నాయి. ఇక కాంగ్రెస్.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో ముందంజలో ఉండగా.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో మాత్రం బీజేపీకి పగ్గాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సార్వత్రిక సమరానికి ముందు జరిగిన ఎన్నికలు కావడంతో వాస్తవ ఫలితాల కోసం అన్ని వర్గాలూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లు కాంగ్రెస్‌ పాలనలో ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, మిజోరంలో ఎంఎన్‌ఎఫ్‌ అధికారంలో ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల ఓట్ల లెక్కింపును అయిదు రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 3వ తేదీన చేపట్టనున్న విషయం తెలిసిందే. ఆరోజే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమా కాదా అనేది తేలనుంది.

Read more RELATED
Recommended to you

Latest news