సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇస్తూ.. మోడీ స్పెషల్ ట్వీట్..!

-

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటి సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, దామోదర రాజనరసింహ, జూపల్లి  కృష్ణారావు మంత్రులుగా ప్రమాణం చేశారు.  తెలంగాణ మంత్రులు అందరూ దాదాపు తెలుగులో  ప్రమాణ స్వీకారం చేయగా.. కేవలం దామోదర రాజనరసింహ మాత్రం ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేశారు. 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. తెలుగులో నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని.. నేను హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు ప్రధాని మోడీ. మరో ట్వీట్ లో ఇంగ్లీషులో కూడా మోడీ రేవంత్ రెడ్డికి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version